Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బన్నీ 'రంగస్థలం' చూడకపోవడానికి కారణం అదేనట!

  • దుమ్మురేపేస్తోన్న 'రంగస్థలం' 
  • ప్రముఖుల ప్రశంసలు 
  • బన్నీ చూడకపోవడంతో సందేహాలు
'రంగస్థలం' విడుదలైన ప్రతి ప్రాంతంలోను తన జోరును కొనసాగిస్తూనే వుంది. థియేటర్స్ దగ్గర ఎంత మాత్రం సందడి తగ్గడం లేదు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా కూడా సుకుమార్ .. చరణ్ లకు ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు. అయితే చరణ్ తో ఎంతో చనువుగా వుండే బన్నీ మాత్రం ఇంతవరకూ ఈ సినిమా చూడలేదు.. స్పందించలేదు. దాంతో ఈ విషయంపై తలో రకంగా మాట్లాడుకుంటున్నారు.

 అయితే బన్నీ ఈ సినిమా చూడటంలో ఆలస్యం కావడానికి కారణం ఉందట. ఒక వైపున 'నా పేరు సూర్య' షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమాను చూడాలనే బన్నీ అనుకున్నాడట. అయితే ఈ సినిమాను తమ హోమ్ థియేటర్లో కాకుండా .. అంతా కలిసి థియేటర్ కి వెళ్లి జనం మధ్యలో చూద్దామని బన్నీతో తల్లి 'నిర్మల' అన్నారట. తల్లి కోరిక మేరకు .. అలాగే చేద్దామని బన్నీ చెప్పాడట. త్వరలోనే ఫ్యామిలీతో కలిసి థియేటర్లోనే బన్నీ ఈ సినిమాను చూడబోతున్నాడన్న మాట.       
allu arjun
anu emmanuel

More Telugu News