సీఏ ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదు... స్మిత్, వార్నర్, బాన్ క్రాఫ్ట్ లకు శిక్ష తగ్గించండి: ఏసీఏ

  • ఆ ముగ్గురికి సీఏ విధించిన శిక్ష సరికాదు
  • గతంలో సీఏ ఇంత కఠినంగా వ్యవహరించిన దాఖలాలు లేవు
  • వారికి శిక్ష తగ్గించాలి
బాల్‌ టాంపరింగ్‌ వివాదం నేపథ్యంలో నిషేధం ఎదుర్కొంటున్న స్మిత్‌, వార్నర్‌, బాన్‌ క్రాఫ్ట్‌ లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విధించిన శిక్ష సరికాదని ఆస్ట్రేలియా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) తెలిపింది. ఆ ముగ్గురిపై సీఏ ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని చెప్పింది. గతంలో ఎప్పుడూ సీఏ ఇంత కఠినంగా వ్యవహరించిన దాఖలాలు లేవని ఏసీఏ అధ్యక్షుడు గ్రెగ్‌ డయ్యర్‌ తెలిపారు. వారికి విధించిన శిక్షను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దేశవాళీ క్రికెట్‌ లో వారు ఆడేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.
Go Back to Shorts
Cricket
Australia
aca

More Telugu News