టైమ్స్ స్క్వేర్ కోసం న్యూయార్క్ వరకు వెళ్లక్కర్లేదు... త్వరలో బెంగళూరులో సాకారం
- బ్రిగేడ్ రోడ్డులో ఏర్పాటు యోచన
- తద్వారా పర్యాటకులను ఆకర్షించాలన్నది వ్యూహం
- ప్రాజెక్టు రిపోర్ట్ రూపొందించే పని స్వాతి రామ్ నాథన్ కు అప్పగింత
ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఓ యుద్ధ స్మారక స్తూపం ఉంది. ఇందుకు సంబంధించి మేయర్ ఆర్ సంపత్ ఇప్పటికే ఓ ప్రకటన కూడా చేశారు. ‘‘న్యూాయార్క్ టైమ్స్ స్క్వేర్ మాదిరిగానే నగరంలో బెంగళూరు స్క్వేర్ ఉండాలని భావిస్తున్నాం. బ్రిగేడ్ రోడ్ ప్రారంభంలో దీన్ని ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్ట్ రూపొందించాలని స్వాతి రామనాథన్ ను కోరాం’’ అని మేయర్ సంపత్ తెలిపారు.