భారత్ లో 60 మంది ఉద్యోగులను తొలగించిన అమేజాన్... త్వరలో మరింత మందికీ ఇదే పరిస్థితి!
- మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో భాగమే
- తొలగింపుపై అమేజాన్ వివరణ
- 25 శాతం మందికి పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశం
డిసెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ 25 శాతం మంది ఉద్యోగులకు శ్రీముఖాలు పంపింది. తాజా ఉద్యోగుల తొలగింపుపై ఎదురైన ప్రశ్నలకు అమేజాన్ బదులిచ్చింది. ‘‘అంతర్జాతీయ సంస్థగా మా ఉద్యోగులను చురుగ్గా ఉంచడంతోపాటు, వారి సేవలను సరైన విధంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కొన్ని ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది. ఇలా ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురయ్యే వారికి పూర్తి సహకారం అందిస్తాం. మరో చోట ఉపాధి కల్పించే ఆఫర్లు ఇస్తాం’’ అని అమేజాన్ అధికార ప్రతినిధి చెప్పారు.