క్రికెటర్ షమీకి భార్యతో కొత్త చిక్కులు...!
- ఐపీఎల్‌లో షమీని ఆడనివ్వొద్దని యాజమాన్యానికి వినతి
- అతనికి అక్రమ సంబంధాలున్నాయని ఆరోపణలు
- షమీని రూ.3 కోట్లకు తిరిగి దక్కించుకున్న ఢిల్లీ జట్టు
కాగా, ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఐపీఎల్ వేలంపాటలో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ షమీని రూ.3 కోట్లకు తిరిగి దక్కించుకున్న సంగతి తెలిసిందే. షమీకి పలువురు యువతులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అతను తనను శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశాడని జహాన్ గతంలో సంచలన ఆరోపణలు చేసింది. వాటితో పాటు ఆమె చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి మాత్రం షమీకి బీసీసీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన తనను కలిసేందుకు వచ్చిన జహాన్‌తో మాట్లాడేందుకు షమీ విముఖత వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.