చైనా సరిహద్దు వద్ద భారత బలగాల గస్తీ.. సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధమన్న ఆర్మీ
- సరిహద్దుల్లో మరోసారి అలజడి
- చైనా దూకుడు
- చెక్ పట్టేందుకు భారత్ సిద్ధం
ఎల్‌ఏసీ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. అలాగే భారత్, చైనా, మయన్మార్ ట్రై జంక్షన్ ప్రాంతంలోనూ బలగాల విస్తరణ చేశామని తెలిపారు. వీటితో పాటు పలు చర్యలు చేపట్టినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. డోక్లామ్‌లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా భారత్ సిద్ధంగా ఉందని ఇటీవల భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.