'ఇక నా జీవితమింతే!' అనుకున్న టైంలో లాటరీ కొట్టాడు.. లక్షాధికారి అయ్యాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఇక నా జీవితమింతే!' అనుకున్న టైంలో లాటరీ కొట్టాడు.. లక్షాధికారి అయ్యాడు!

  • అనారోగ్య కారణాలతో ఫోర్డ్ ప్లాంట్ ఉద్యోగానికి రాజీనామా
  • మనస్పర్థలతో ప్రేయసి దూరం
  • నిరాశలో ఉండగా, 9.3 మిలియన్ పౌండ్ల లాటరీ
నిన్నమొన్నటి వరకు ఆయన తీవ్రమైన నిరాశలో బతికాడు. అనారోగ్యం కారణంగా చేస్తున్న ఉద్యోగం కూడా ఊడిపోయింది. వివిధ కారణాలతో ప్రేయసి వదిలేసి వెళ్లిపోయింది. జీవితం ఇంత దుర్భరంగా మారిందేమిటా? అని ఆందోళన చెందుతున్న సమయంలో ఊహించని విధంగా పాల్‌ లాంగ్‌ కి 9.3 మిలియన్  పౌండ్స్‌ (దాదాపు 62 లక్షలు) లాటరీ తగిలి రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది.

దాని వివరాల్లోకి వెళ్తే... యూకేకి చెందిన పాల్ లాంగ్ ఫోర్డ్ ప్లాంట్ లో ఉద్యోగం చేసేవాడు. అనారోగ్య కారణాలతో దానిని వదులుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజుల క్రితం ప్రేయసి జూలీ వెస్ట్ (52) మనస్పర్థల కారణంగా విడిపోయింది. దీంతో పాల్ తీవ్ర నిరాశలో కూరకుపోయాడు. ఇంతలో ఆయన ఎప్పుడో కొన్న టికెట్ కు లాటరీ తగిలిందని మీడియాలో వార్తలు రావడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

దీనిపై ఆయన మాట్లాడుతూ, ‘గత కొన్ని రోజులుగా జీవితంలో గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ 24 గంటల్లో నా జీవితం మారిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. నా ప్రేయసి నాతో కలిసి ఉన్నప్పుడే ఈ లాటరీ టికెట్ కొన్నాను. ఇప్పుడు ఆమె నాతో లేదు. ఆమెను పిలిచి మంచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని చెప్పాడు.

 అలాగే లాటరీ డబ్బులను వృథాగా ఖర్చు చేయనని తెలిపాడు. ఒక కారు కొని, మిగిలిన మొత్తాన్ని కుటుంబం, స్నేహితుల అవసరాలకి ఉంచుతానని చెప్పాడు. కొంత మొత్తాన్ని పిల్లల భవిష్యత్ కోసం దాచిపెడతానని పాల్ తెలిపాడు. తన జీవన విధానం మార్చుకోనని, సాధారణంగానే జీవిస్తానని నవ్వుతూ అన్నాడు.
lottery
huge amount of cash
uk money Unemployee

More Telugu News