నందిగామలో ‘రంగస్థలం’ సినిమా మధ్యలో నిలిపివేత.. ఫాన్స్ ఆందోళన.. ఉద్రిక్తత!
- కృష్ణా జిల్లా నందిగామలోని మయూరి థియేటర్లో ఘటన
- అధిక ధరలకు టికెట్లు విక్రయించారని కలెక్టర్‌కు ఫిర్యాదు
- విచారణ పేరుతో సినిమా ప్రదర్శన నిలిపేసిన తహశీల్దార్
ఆ థియేటర్ యాజమాన్యం టికెట్లను అధిక ధరలకు అమ్ముకుంటోందని కొందరి నుంచి ఫిర్యాదు అందడంతో జిల్లా కలెక్టర్‌కు ఆదేశాల మేరకు స్థానిక తహశీల్దార్ థియేటర్‌కు చేరుకొని విచారణ పేరుతో సినిమా ప్రదర్శనను మధ్యలో నిలిపివేసినట్లు తెలిసింది. ఒక్కసారిగా సినిమా ఆగిపోయినందుకు ప్రేక్షకులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.