ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న యుద్ధ విమానాల ధరను చెప్పలేం: రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
- రాఫెల్ విమానాల ధరలను చెప్పలేం
- దేశ భద్రత కోసం బహిర్గతం చేయలేం
- రాహుల్ అనవసర ఆరోపణలు చేస్తున్నారు
ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, విమానాల ధరలను చెప్పలేమని తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఒప్పందం వివరాలను బహిర్గతం చేయలేమని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఆయుధం దొరుకుతుందేమో అని రాహుల్ వెతుకుతున్నారని... ఆయనకు ఏదీ దొరక్కపోవడంతో, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వాయుసేనకు రాఫెల్ ఒప్పందం ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు.