అవినీతిపరులకు సుప్రీం షాక్.. ఆరు నెలలకు మించి స్టే ఇవ్వకూడదని ఆదేశం!
- నేటి నుంచి స్టే ఆర్డర్ రెండు మూడు నెలలకే పరిమితం
- సహేతుకమైన కారణం ఉంటేనే పొడిగింపు
- విచారణలో జాప్యం అన్నది పాలనను దెబ్బతీస్తుంది
సహేతుకమైన కారణం ఉంటే తప్ప ఆరు నెలలకు మించి స్టే ఇవ్వరాదని, స్టే ఆర్డర్‌ను రెండు మూడు నెలలకే పరిమితం చేయాలని పేర్కొన్న కోర్టు, ఈ ఆదేశాలను తక్షణం పాటించాలని ఆదేశించింది. బుధవారం నుంచి స్టే ఆర్డర్లు ఆరు నెలలకే పరిమితమవుతాయని వివరించింది. ఓ అవినీతి కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టుకు ఉన్న పరిధి గురించి ఢిల్లీ హైకోర్టు ప్రశ్నకు సమాధానంగా సుప్రీం ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.