భారత్లో గూగుల్ 'స్ట్రీట్ వ్యూ' సర్వీసుకు చుక్కెదురు
- గూగుల్ స్ట్రీట్ వ్యూ సర్వీసుకు భద్రతా కారణాల వల్ల అనుమతి నిరాకరణ
- వేలూరు ఎంపీ బాలసుబ్రమణ్యం ప్రశ్నకు కేంద్ర మంత్రి గంగారం అహీర్ సమాధానం
- ప్రస్తుతం 82 దేశాల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ సేవలు
నగరంలోని కొన్ని బహిరంగ ప్రదేశాలను గూగుల్ సిబ్బంది కెమేరాలో బంధిస్తుండటాన్ని స్థానిక అధికారులు వ్యతిరేకించారు. వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ సర్వీసు అక్కడితో ఆగిపోయింది. కాగా, మళ్లీ అదే ఏడాదిలో గూగుల్ భారత్లోని 31 చారిత్రక కట్టడాలను 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి ఈ సర్వీసు ప్రారంభం కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉంది. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఈ సర్వీసుకు భారత్లో చుక్కెదురైనట్లు స్పష్టమయింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ సర్వీసు ప్రస్తుతం 82 దేశాల్లో ఉంది.