నాగ్... నువ్వు సైకిల్ చైనుతో కొట్టినా నా మాట ఇదే... నీకన్నా అఖిల్ బెటర్: రాంగోపాల్ వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగ్... నువ్వు సైకిల్ చైనుతో కొట్టినా నా మాట ఇదే... నీకన్నా అఖిల్ బెటర్: రాంగోపాల్ వర్మ

  • 25 ఏళ్ల క్రితం నాగ్ తో 'శివ' తీసిన వర్మ
  • తాజాగా అఖిల్ తో సినిమా ప్రకటన
  • హై సెన్సిటివ్ వయొలెన్స్ చిత్రమన్న వర్మ
దాదాపు 25 సంవత్సరాల క్రితం నాగార్జునతో 'శివ' వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు ఆయన కుమారుడు, ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ తో సినిమాను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"హాయ్ నాగార్జున... నేను నిజాయతీగా చెబుతున్నాను. నువ్వు నీ సైకిల్ చైన్ తో నన్ను కొట్టినా సరే... 'శివ' సమయంలో నీ గొంతుతో పోలిస్తే ఇప్పుడు అఖిల్ కు బెటర్ వాయిస్ ఉంది. బెటర్ స్టయిల్ ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో అఖిల్ నీకన్నా మెరుగ్గా ఉన్నాడు" అని వ్యాఖ్యానించాడు. మరో ట్వీట్ లో తన చిత్రం లవ్ స్టోరీ కాదని, యాక్షన్ మేళవింపుతో కూడిన సినిమా అని, అంతర్లీనంగా ప్రేమ ఉన్నప్పటికీ, హై సెన్సిటివ్ వయొలెన్స్ కలగలిపిన చిత్రమని చెప్పుకొచ్చాడు.
varma
Nagarjuna
Akhil
New Movie

More Telugu News