జట్టంతా ట్యాంపరింగ్ కు పాల్పడడం గురించి తొలిసారి వింటున్నా!: కపిల్ దేవ్
- క్రికెట్ లో ఒక ఆటగాడు టాంపరింగ్ కు పాల్పడడం సాధారణమే
- జట్టంతా నేరంలో భాగమవ్వడం ప్రమాదకరం
- గతంలో ఎప్పుడూ ఇలాంటి వార్త వినలేదు
సాధారణంగా బాల్ టాంపరింగ్ చేస్తూ ఆటగాడు దొరికిపోతే ఐసీసీ చర్యలు తీసుకోవడం సర్వసాధారణమని పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉందని, ఒక జట్టంతా టాంపరింగ్ కు పాల్పడిందని, ఇది క్రికెట్ కు ప్రమాదకరమైన పరిణామనని పేర్కొన్నాడు. గతంలో తానెప్పుడూ ఇలాంటి వార్త వినలేదని తెలిపాడు. ఒక నేరంలో జట్టు మొత్తం భాగం కావడం గురించి తొలిసారి వింటున్నానని కపిల్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.