రష్యా షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం... 64 మంది సజీవ దహనం
- పశ్చిమ సైబీరియాలోని కెమెరొవోలోని వింటర్ చెర్రీ షాపింగ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం
- థియేటర్ లో చెలరేగిన మంటలు
- క్షణాల్లో నాలుగంతస్తులకు చుట్టుముట్టిన కీలలు
నాలుగు అంతస్తులకు పాకిన మంటల్లో షాపింగ్ చేసేందుకు వచ్చినవారు అందరూ చూస్తుండగానే చిక్కుకుపోయారు. దీంతో రెండు థియేటర్ల పైకప్పులు కూలిపోయాయి. ఈ ఘటనలో సజీవ దహనమైన 64 మంది మృతదేహాలను రెస్క్యూటీమ్ గుర్తించింది. మరో 10 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. పలువురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో హెచ్చరించేందుకు ఏర్పాటు చేసిన ఫైర్ అలారమ్స్ పని చేయలేదని, మంటలు చూసిన మాల్ సిబ్బంది వినియోగదారులను బయటకు పంపే ప్రయత్నం కూడా చేయలేదని పలువురు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.