Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'లీక్స్ స్టార్టెడ్' అంటూ తొలి ఫోటో పోస్టు చేసిన నటి శ్రీ రెడ్డి!

  • కాస్టింగ్ కౌచ్ పై ఆధారాలు ఉన్నాయంటున్న శ్రీ రెడ్డి
  • ఒక్కొక్కటీ వెల్లడిస్తానని చెప్పిన నటి
  • తొలి ఫోటోను ఫేస్ బుక్ లో పెట్టిన శ్రీరెడ్డి
టాలీవుడ్ లో 99 శాతం మంది ఆడవాళ్లను వాడుకునేవారేనని ఇటీవలి కాలంలో వివిధ టీవీ చానళ్లలో స్పెషల్ డిస్కషన్లు పెడుతున్న నటి శ్రీ రెడ్డి, టాలీవుడ్ ప్రముఖుల బాగోతాన్ని బయటపెడతానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి తన వద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయని, వాటిని ఒక్కొక్కటిగా బయట పెడతానని చెప్పిన శ్రీరెడ్డి, అన్నట్టుగానే తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పిక్చర్ పెట్టింది. ఇందులో ముఖం కనిపించని ఓ వ్యక్తి శ్రీ రెడ్డిని కిస్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 'లీక్స్ స్టార్టెడ్' అంటూ శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుండగా, ఆమె ఇంకా ఎంతమంది ఫోటోలు బయటకు తెస్తుందోనని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fiamsrireddy%2Fposts%2F2080991322147789&width=500" width="500" height="593" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true"></iframe>
Tollywood
Sri Reddy
Casting Couch

More Telugu News