జగన్ మోహన్ రెడ్డికి చరిత్రేముంది?: మురళీమోహన్

  • చంద్రబాబు నాయుడుకు ఉన్నంత అనుభవం ఏ ఇతర నాయకులకు ఉంది?
  • నిన్న గాక మొన్న వచ్చిన పవన్ కల్యాణ్ కి చాలా ఆవేశం ఉంది
  • రాష్ట్రాభివృద్ధి కుంటుపడకూడదన్నదే మా ధ్యేయం 
  • ఏపీని ‘ది బెస్ట్’ స్టేట్ గా తీర్చిదిద్దుతాం  
ఏపీని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబునాయుడుకు ఉన్నంత అనుభవం కానీ, ఆయనకు ఉన్నటువంటి కమిట్ మెంట్ గానీ ఏ ఇతర నాయకులకు ఉంది? అని టీడీపీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ ప్రశ్నించారు. ‘ఎన్టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘జగన్ మోహన్ రెడ్డి గారికి చరిత్రేముంది? ఎంత బ్యాడ్? మరి, అలాగే, నిన్న గాక మొన్న వచ్చిన పవన్ కల్యాణ్ గారికి ఆవేశం ఉంది. చాలా ఆవేశం ఉంది. బాలచంద్రుడు చాలా ఆవేశంతో ముందుకొచ్చి పద్మవ్యూహాన్ని ఛేదించలేక అందులో ఇరుక్కుపోయాడు. అలా, అవకూడదు’ అని అన్నారు.

రాష్ట్రాభివృద్ధి కుంటుపడకూడదన్నదే తమ ధ్యేయమని, తమపై ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోమని చెప్పారు. ‘మా లక్ష్యం ఒక్కటే..ఆంధ్రప్రదేశ్ ని ‘ది బెస్ట్’ స్టేట్ గా తీర్చిదిద్దడం. అందుకోసం, ఎంత కృషి అయినా చేస్తాం’ అని మురళీమోహన్ స్పష్టం చేశారు.
Go Back to Shorts
Jagan
murali mohan

More Telugu News