ఈ కారణం వల్లే సుజనాపై దుష్ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు
- పీఎంవోలో మీడియాను చూసి విజయసాయి ఎందుకు దాక్కున్నారు?
- ప్రజల దృష్టిని మరల్చేందుకే సుజనాపై విమర్శలు చేస్తున్నారు
- నిజాయతీగా ఉన్న మాపైనే విమర్శలు చేస్తారా?
ప్రజల తరపున నిజాయతీతో పోరాటం చేస్తున్నామని మీకు కంటగింపుగా ఉందా? అంటూ వైసీపీపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న మాపైనే ఆరోపణలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంవోలో మీడియా కంట పడకుండా విజయసాయిరెడ్డి ఎందుకు దాక్కున్నారని ప్రశ్నించారు. వైసీపీలా తమకు లాలూచీ రాజకీయాలు తెలియవని చెప్పారు. కేసులు మాఫీ చేయించుకునే అవసరం మీకుంది కానీ, మాకు లేదని అన్నారు.