షమీపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన భార్య.. మండిపడుతోన్న నెటిజన్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షమీపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన భార్య.. మండిపడుతోన్న నెటిజన్లు

  • తన భర్త షమీ మరో అమ్మాయితో చాటింగ్‌ చేశాడంటూ హసీన్ పోస్ట్‌
  • ఆధారాలు ఇవిగో అంటూ చాటింగ్‌ స్క్రీన్‌షాట్లు
  • తన భర్త ఏ ఒక్కరినీ వదల్లేదంటూ తీవ్ర ఆరోపణలు
టీమిండియా ఆట‌గాడు షమీపై ఆయ‌న భార్య హసీన్ జహాన్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి షమీపై విమర్శలు చేస్తూ పోస్టు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. తన భర్త షమీ మరో అమ్మాయితో చాటింగ్‌ చేశాడని, ఆధారాలు ఇవిగో అంటూ చాటింగ్‌ స్క్రీన్‌షాట్లను ఫేస్‌బుక్‌లో పెట్టింది. అంతేగాక తన భర్త ఏ ఒక్కరినీ వదల్లేదంటూ కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె చేస్తోన్న ఆరోపణలు నిజమై ఉండొచ్చు కానీ, కోర్టుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇలా చేయడం ఏంటంటూ విమర్శలు చేస్తున్నారు.

కొందరు నెటిజన్లు మరింత తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు. హసీన్ తన భర్త షమీపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక ఆయన మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని కూడా ఆరోపణలు చేయడంతో షమీ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడు. చివరకు షమీ మ్యాచ్ ఫికింగ్స్‌కు పాల్పడలేదని బీసీసీఐ తేల్చింది.  
shami
Facebook
Cricket

More Telugu News