బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు... మసీదు ఇస్లాంలో భాగమేనా? అన్న దానిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ
- ఇస్లాంలో భాగం కాదని 1994లో సుప్రీంకోర్టు తీర్పు
- ఇప్పుడా తీర్పుపై పునర్విచారణ
- ఆ తర్వాతే తుది తీర్పు అన్న కోర్టు
1994లో మసీదు అన్నది ఇస్లాంలో భాగం కాదని సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్పుపై రాజ్యాంగ ధర్మాసనం పునర్విచారణ చేస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాద కేసు విచారణ మరింత ఆలస్యం కానుంది. 70 ఏళ్ల నుంచి వివాదం ఉన్న ఈ కేసు విచారణను ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన పెద్ద ధర్మాసనానికి బదిలీ చేయాలన్న ఓ పిటిషనర్ వినతిని కోర్టు తిరస్కరించింది.