వామ్మో! తాగొచ్చిన విమాన పైలట్లు.... ఇద్దరిపై జెట్ ఎయిర్ వేస్ వేటు
- శ్వాస విశ్లేషణ పరీక్షల్లో అడ్డంగా పట్టుబడిన పైలట్, కో పైలట్
- రాజీనామా చేయాలని ఆదేశించిన సంస్థ
- వారి లైసెన్స్ లు మూడు నెలల పాటు సస్పెన్షన్
డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనలకు అనుగుణంగా ఆ ఇద్దరి లైసెన్స్ లను మూడు నెలల పాటు సప్పెండ్ చేసింది. విమానం నడిపే ముందు పైలట్లకు విధిగా శ్వాస విశ్లేషణ పరీక్ష నిర్వహిస్తారు. ఆ సందర్భంగా వారు మద్యం సేవించి వచ్చినట్టు వెలుగు చూసింది. దీనిపై జెట్ ఎయిర్ వేస్ ప్రతినిధి స్పందిస్తూ... అతిథుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.