బీమా కంపెనీ మాయాజాలం.. రైతుకు నష్టపరిహారం 2 రూపాయలు!
- తమిళనాడు రైతులకు పంట నష్టపరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేసిన దిండిగల్ కేంద్ర సహకార బ్యాంక్
- 10, 5, 4, 2 రూపాయల చెక్కులను రైతులకు అందజేసిన బ్యాంక్
- బ్యాంక్ ఖాతా కోసం రైతు 500 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిపై విమర్శలు
తిరుమలైసామి అనే మరో రైతు 50 రూపాయల ప్రీమియం కట్టగా, అతనికి 5 రూపాయల నష్టపరిహారం చెక్కు ఇచ్చింది. మరో రైతుకు 4 రూపాయల చెక్కు, ఇంకో రైతుకు 2 రూపాయల చెక్కులు అందజేసింది. ఈ చెక్కులను అసెంబ్లీలో ప్రదర్శించిన మాజీ మంత్రి, డీఎంకే నేత కె.పిచండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రూపాయలకు ఏమొస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి తోడు ఈ చెక్కులను మార్చుకోవాలంటే 500 రూపాయలతో బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉందని, 2 రూపాయల కోసం 500 ఖర్చుతో బ్యాంకు ఖాతా తెరవడమంత దారుణం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.