ఉద్యోగానికి రాజీనామా చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!
- వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న లక్ష్మీనారాయణ
- జగన్ కేసులను విచారించిన సీబీఐ మాజీ జేడీ
- ప్రస్తుతం అడిషనల్ డీజీ హోదాలో ఉన్న లక్ష్మీనారాయణ
ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖలు పంపారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాజీనామా దరఖాస్తును ఆమోదించాల్సి ఉంది. మరోవైపు, లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీ రాజకీయాల్లోకి వస్తారా? లేదా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.