సభాపతి విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకోవచ్చు: సుజనా చౌదరి
- సభ్యులను అదుపు చేసే బాధ్యత స్పీకర్‌ది
- అవిశ్వాస తీర్మానంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
- మా విజ్ఞప్తులపై సభాపతి సానుకూలంగా స్పందించడం లేదు
- అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలు అడ్డుపడుతున్నాయి
అవిశ్వాస తీర్మానంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సుజనా చౌదరి డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తులపై సభాపతి సానుకూలంగా స్పందించడం లేదని, అవిశ్వాసం ఎదుర్కుంటే కేంద్ర సర్కారు పడిపోయే అవకాశం లేదని బీజేపీకి తెలుసని, అయినప్పటికీ ఇలా చేస్తోందని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనివ్వకుండా అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని, తమ తమ రాష్ట్రాల సమస్యలపై చర్చించాలంటూ నిరసన తెలుపుతున్నాయని అన్నారు. రేపు తమ తమ రాష్ట్రాల సమస్యలపై లోక్‌సభలో చర్చించేటప్పుడు కూడా అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.