కార్డులో బ్యాలన్స్ లేకుండా స్వైప్ చేస్తే చార్జీలతో బాదేస్తున్న బ్యాంకులు
- డిక్లైన్డ్ లావాదేవీలపై చార్జీలు
- ఎస్ బీఐ రూ.17, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో రూ.25
- బ్యాలన్స్ లేకుండా స్వైప్ చేయవద్దు
ఎస్ బీఐ అయితే ఏటీఎం లేదా పీఓఎస్ మెషిన్ల వద్ద కార్డు లావాదేవీ డిక్లైన్ అయితే రూ.17 చార్జీ విధిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఏకంగా రూ.25 రాబడుతున్నాయి. ఈ చార్జీకి జీఎస్టీ అదనం. డీమోనిటైజేషన్ తర్వాత కార్డు లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మర్చంట్ డిస్కౌంట్ రేటు (పీవోఎస్ మెషిన్ ద్వారా లావాదేవీపై దుకాణాదారులు చెల్లించే చార్జీ)ను రద్దు చేసిన విషయం తెలిసిందే.