పత్తాలేని ఫేస్ బుక్ అధినేత! యూజర్ల సమాచారం చోరీపై స్పందన కరవు
- ఇంత వరకు అధికారికంగా స్పందించని జుకెర్ బెర్గ్
- కంపెనీ సీవోవో శాండ్ బర్గ్ సైతం మౌనం
- వివరణ కోరిన యూరోపియన్ యూనియన్
సాధారణంగా ఫేస్ బుక్ కు సంబంధించి విమర్శలు వచ్చినా, వివాదాలు ఏర్పడినా జుకెర్ బెర్గ్ కానీ, షెరిల్ శాండ్ బర్గ్ కానీ ఎవరో ఒకరు బ్లాగ్ ద్వారా స్పందిస్తుంటారు. కానీ, డేటా చోరీపై వీరింత వరకు మీడియా ముందుకు రాలేదు. ఈ శుక్రవారం కంపెనీ ఉద్యోగులను ఉద్దేశించి జుకెర్ బెర్గ్ మాట్లాడాల్సి ఉంది. కేంబ్రిడ్జ్ అనలైటిక అనే ఆన్ లైన్ ప్రకటనల కన్సల్టింగ్ కంపెనీ, ఫేస్ బుక్ యూజర్ల సమాచారాన్ని అనధికారికంగా సేకరించినట్టు ఆరోపణలు రాగా, దీన్ని ఫేస్ బుక్ కూడా ధ్రువీకరించిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని యూరోపియన్ యూనియన్, బ్రిటిష్ చట్ట సభ సభ్యులు ఇప్పటికే డిమాండ్ చేయడం గమనార్హం.