రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్టేషన్ లో దిగగానే ఓలా క్యాబ్ లో ఇంటికి చేరచ్చు!
- ఓలా క్యాబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఐఆర్సీటీసీ
- వారం ముందుగా క్యాబ్‌ను బుక్ చేసుకునే అవకాశం
- మనకు కావలసిన రీతిలో బుక్ చేసుకునే సౌలభ్యం
ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఐఆర్సీటీసీ యాప్, వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ‘బుక్ ఎ క్యాబ్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. స్టేషన్లో దిగిన వెంటనే క్యాబ్ సిద్ధంగా ఉంటుంది. రైలెక్కిన ప్రయాణికులు క్షేమంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఓలా క్యాబ్‌తో ఈ ఒప్పందం చేసుకున్నట్టు ఐఆర్సీటీసీ తెలిపింది.