త్రీడీ వెర్షన్లో అల్లు అరవింద్ 'సంపూర్ణ రామాయణం'
- భారీస్థాయిలో 'రామాయణం' చిత్ర నిర్మాణం
- రంగంలోకి గీతాఆర్ట్స్ తో పాటు మరో రెండు పెద్ద బ్యానర్లు
- త్రీడీ వెర్షన్లో 3 భాగాలుగా రిలీజ్
ఈ సినిమాకి 'సంపూర్ణ రామాయణం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనేది తాజా సమాచారం. ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించిన అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా .. మధు మంతెనలను ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా చేసుకున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో .. మూడు భాగాలుగా రూపొందే ఈ సినిమాను, తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో త్రీడీ వెర్షన్ లో విడుదల చేసే ఆలోచనలో వున్నారు.