రేపోమాపో జగన్ కేసులన్నీ కొట్టేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది: చంద్రబాబు
- ప్రధాని కార్యాలయంలో విజయసాయిరెడ్డి, ఇతర నేతలు తిరుగుతున్నారు
- కేసులు కొట్టేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది
- ఇప్పుడు దేశం మొత్తం మన వైపే చూస్తోంది
ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో ఈరోజు ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యమని చెప్పారు. జాతీయ స్థాయిలో మన గొంతుకను వినిపించామని... ఇప్పుడు యావత్ దేశం మనవైపే చూస్తోందని చెప్పారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని మార్గనిర్దేశం చేశారు.