సభ జరిగే పరిస్థితి లేదంటూ... లోక్ సభను సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్
- సమావేశాలను అడ్డుకున్న విపక్ష ఎంపీలు
- ముందుకు సాగని ప్రశ్నోత్తరాల కార్యక్రమం
- స్పీకర్ విన్నపాలను పట్టించుకోని ఎంపీలు
ఈ నేపథ్యంలో, పశ్నోత్తరాల కార్యక్రమం ఏమాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ పలుమార్లు విన్నవించినప్పటికీ... పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. చివరకు విధిలేని పరిస్థితుల్లో సభను వాయిదా వేశారు. సభను కొనసాగించలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో, లోక్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.