ఒక రకంగా సాహసమే .. మూగవాని పాత్రలో యంగ్ హీరో
- నూతన దర్శకుడితో నారా రోహిత్
- ఆయనకి ఇది 18వ సినిమా
- చంద్రమోహన్ తరువాత నారా రోహితే
మంజునాథ్ అనే నూతన దర్శకుడితో అట్లూరి నారాయణరావు నిర్మించే సినిమాలో నారా రోహిత్ ఇలా కనిపించనున్నాడు. ఇది నారా రోహిత్ కి 18వ సినిమా. గతంలో 'సిరిసిరి మువ్వ' సినిమాలో చంద్రమోహన్ పూర్తిస్థాయి మూగవాని పాత్రలో నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకి నారా రోహిత్ ఆ తరహా పాత్రను పోషించనుండటం విశేషం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.