ఎస్ బీఐ ఖాతాదారులకు ఊరట... కనీస నిల్వ లేకపోతే ఇకపై చార్జీలు స్వల్పమే

  • గరిష్ట చార్జీలు రూ.50 నుంచి రూ.15కు...
  • కనిష్ట చార్జీలు రూ.40 నుంచి రూ.10కి తగ్గింపు
  • ఏప్రిల్ 1 నుంచి అమలు
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతాదారులకు భారీ ఊరట లభించింది. ఖాతాల్లో కనీస బ్యాలన్స్ లేకపోతే విధించే చార్జీలను బ్యాంకు 75 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో ఈ చార్జీలు రూ.50గా ఉండగా, ఇకపై రూ.15గా అమలవుతుంది. దీనికి జీఎస్టీ అదనం. కనీస నిల్వలో 75 శాతానికి పైగా లేకపోతేనే ఈ చార్జీ వర్తిస్తుంది. ఒకవేళ 50 శాతానికంటే తక్కువగా ఉంటే అప్పుడు చార్జీ రూ.10 మాత్రమే. సెబీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో గరిష్టంగా (75 శాతానికి పైగా బ్యాలన్స్ లేని సందర్భంలో) ఉన్న రూ.40 చార్జీ రూ.12, రూ.10కి తగ్గించడం జరిగింది. ఈ చార్జీలకు జీఎస్టీ అదనం. అలాగే ఈ శాఖల్లో కనిష్ట చార్జీలు అంటే బ్యాలన్స్ లో కేవలం 50 శాతం అంతకంటే తక్కువ ఉన్న సందర్భాల్లో విధించే చార్జీలు రూ.7.50, రూ.5కు తగ్గాయి. సవరించిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చార్జీల తగ్గింపుతో 25 కోట్ల కస్టమర్లకు ఉపశమనం కలగనుంది. ఏడాది క్రితమే సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలన్స్ లను పెంచుతూ, వీటి నిర్వహణలో విఫలమైతే నెలవారీ జరిమానాలను బ్యాంకు నిర్ణయించిన విషయం విదితమే. 
Go Back to Shorts
sbi
mab charges

More Telugu News