గాయని నేహా కక్కర్ కన్ను గీటిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్
- ప్రియా వారియర్‌ను అనుకరిస్తూ తుపాకీ పేల్చుతున్నట్లు నటించిన నేహా
- ప్రియా వారియర్ ప్రభావం తనపై పడిందని వ్యాఖ్య
- ఈ వీడియోను అప్పుడే లక్ష మంది చూసిన వైనం
ప్రియా వారియర్ ను అనుకరిస్తూ కన్ను గీటిన వారి జాబితాలో మరో సెలబ్రిటీ చేరింది. ప్రముఖ గాయని నేహా కక్కర్ కూడా చేతి వేళ్లకు ముద్దు పెట్టి తుపాకీలా గురి పెడుతూ కన్నుగీటుతూ ప్రియా వారియర్ లా చేసింది. ప్రియా వారియర్ ప్రభావం తనపై పడిందని, కాకపోతే గన్ను ఉల్టా అయిపోయిందని పేర్కొంటూ ఆమె సరదాగా ఈ దృశ్యాలను తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. నేహా కక్కర్ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్ష మందికి పైగా చూశారు. మీరూ చూడండి..