తమిళనాడులో పెను విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి కార్చిచ్చులో చిక్కుకున్న విద్యార్థుల బృందం.. ఐదుగురు మృతి
- కురంగణి పర్వత ప్రాంతాల్లో ఘటన
- హెలికాప్టర్ల సాయంతో 15 మందిని రక్షించిన రెస్క్యూ బృందం
- మరికొందరు గల్లంతు.. కొనసాగుతున్న ఆపరేషన్
ఈ ప్రాంతంలో వెలుతురు తక్కువగా ఉండడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడినట్టు మదురై సర్కిల్ కన్జర్వేటర్ ఆర్కే జగేనియా తెలిపారు. మంటలు వేగంగా నలువైపులా వ్యాపిస్తుండడంతో అటవీ సిబ్బంది, సమీప గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
చెన్నైకి చెందిన ఓ ట్రెక్కింగ్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల బృందం పశ్చిమ కనుమల్లోని బోధికి చేరుకుంది. శుక్రవారం ట్రెక్కింగ్ ప్రారంభం కాగా శనివారం కేరళవైపు అడవుల్లోకి చేరుకున్నారు. ఆదివారం కురంగణి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభించారు. ఆదివారం సాయంత్రానికి వారు తిరిగి బోధి చేరుకుని చెన్నైకి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా అంతలోనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.