పెళ్లయిన గంటల్లోనే కుప్పకూలి మృతి చెందిన వధువు.. శోకసంద్రంలో రెండు కుటుంబాలు

  • పెళ్లింట పెను విషాదం
  • ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి వెళ్తుండగా కుప్పకూలిన నవ వధువు
  • ఆసుపత్రికి తరలించినా దక్కని ఫలితం
కాళ్ల పారాణి ఆరకుండానే.. పెళ్లి బాజాల చప్పుడు చెవిలో ఇంకా మార్మోగుతుండగానే ఓ నవ వధువు అకస్మాత్తుగా మృతి చెందింది. సూర్యాపేటలో జరిగిన ఈ విషాద ఘటన రెండు కుటుంబాలను శోక సంద్రంలోకి నెట్టేసింది. సూర్యాపేటకు చెందిన కటకం గాయత్రి (22)కి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో శనివారం రాత్రి ఘనంగా వివాహం జరిగింది. అనంతరం బంధుమిత్రులతో కలిసి ఫంక్షన్ హాలు నుంచి వధువు ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో దేవాలయంలోకి వెళ్లి దేవుడికి నమస్కరించి బయటకు వస్తుండగా నవ వధువు గాయత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. హతాశులైన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయత్రిని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారు.
Go Back to Shorts
Marriage
Suryapet
Mahabubabad

More Telugu News