దేశం అభివృద్ధి చెందుతున్నా.. మరోవైపు సమస్యలు వెంటాడుతున్నాయి: ఢిల్లీలో కేటీఆర్‌

  • ఢిల్లీలో 51వ స్కోచ్ సమ్మిట్ లో పాల్గొని కేటీఆర్‌ ప్రసంగం
  • దేశంలో మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉంది
  • అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది
  • కేసీఆర్ కృషితో విద్యుత్ సమస్యను అధిగమించాం
దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ మరోవైపు కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో 51వ స్కోచ్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించారు. దేశంలో మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి కేటీఆర్ వివరించి చెప్పారు. తెలంగాణలో అమలవుతోన్న పథకాలను వివరించారు.

రాష్ట్రంలో తీసుకువచ్చిన పారిశ్రామిక విధానాన్ని గురించి కూడా మాట్లాడారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ కృషితో విద్యుత్ సమస్యను అధిగమించామని, తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులు, ఇంటింటికీ తాగునీరు, డబుల్ బెడ్ రూమ్ పథకాల వంటి పథకాలకు మంచి స్పందన వస్తోందని చెప్పారు. 
Go Back to Shorts
KTR
Telangana
TRS
India

More Telugu News