ఫేస్ బుక్ వంచన... బ్లాక్ మెయిల్ చేసిన ఘనుల అరెస్టు
- ఫేస్ బుక్ లో వివాహితకు పరిచయమైన యువకుడు
- ఛాటింగ్ లో వ్యక్తిగత విషయాలపై చర్చ
- ఛాటింగ్ ను అడ్డంపెట్టుకుని నగ్న పోటోలు పంపాలని బ్లాక్ మెయిల్
వారిద్దరూ ఆమెకు పరిచయస్తులు కావడంతో వారు కూడా బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. దీంతో ఫేస్ బుక్ అకౌంట్ డిలీట్ చేయాలని నిర్ణయించుకున్న బాధితురాలు, ఆ వివరాలు తనకు తెలియకపోవడంతో సమీర్ ఖాన్ అనే స్నేహితుడ్ని ఆశ్రయించింది. అకౌంట్ డిలీట్ చేస్తానన్న సమీర్ ఖాన్ ఆమె యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తీసుకుని, ఆమె ఛాటింగ్స్, షేర్ చేసిన ఫోటోలను చూసి, ఆమె భర్తకు వాటిని పంపి, తనకు ఒక ల్యాప్ ట్యాప్, పెన్ డ్రైవ్, 5,000 రూపాయల నగదు పంపాలని బ్లాక్ మెయిల్ చేశాడు. భార్య ఛాటింగ్, ఫోటోలు చూసిన భర్త దుబాయ్ నుంచి హైదరాబాదు చేరుకుని, ఆమెను నిలదీశాడు. దీంతో జరిగినదంతా ఆయనకు వివరించడంతో దంపతులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, జుబేర్, అతని ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. సమీర్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నప్పటికీ, దివ్యాంగుడు కావడం, నడవగలిగే స్థితిలో లేకపోవడంతో రిమాండ్ కు తరలించలేదు.