'శైలజా రెడ్డి అల్లుడు'లో విభిన్నమైన పాత్రలో దాసరి అరుణ్ కుమార్

  • మారుతి దర్శకత్వంలో చైతూ
  • టైటిల్ గా 'శైలజా రెడ్డి అల్లుడు'
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
కొన్నేళ్ల క్రితం తెలుగు తెరకి హీరోగా పరిచయమైన దాసరి అరుణ్ కుమార్, ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను పోషించిన ఆయన, క్రమేణ సినిమాలకి దూరమయ్యాడు. ఇటీవల వచ్చిన 'ఒక్క క్షణం' సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

చైతూ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు ' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ కి అంకుల్ పాత్రలో దాసరి అరుణ్ కుమార్ కనిపిస్తాడట. ఈ పాత్రను మారుతి వెరైటీగా డిజైన్ చేశాడని అంటున్నారు. ఈ సినిమా తరువాత దాసరి అరుణ్ కుమార్ బిజీ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషిస్తోంది.      
Go Back to Shorts
chaitu
dasari arun kumar

More Telugu News