ఎమ్మెల్యే కుమార్తె, సినిమా దర్శకుడి ప్రేమ పెళ్లి... పోలీసుల అదుపులో బంధువులు, సోషల్ మీడియాలో కొత్త జంట!

  • ఆరు నెలలుగా ప్రేమలో లక్ష్మి, సుందర్ గౌడ్
  • నిన్న మైసూరు చాముండి కొండపై పెళ్లి
  • ఎమ్మెల్యే శివమూర్తి ఫిర్యాదుతో వరుడి బంధువులు అరెస్ట్
  • ఇష్టపడే పెళ్లి చేసుకున్నానంటూ లక్ష్మి వీడియో
కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే కుమార్తె, సినిమా దర్శకుడి ప్రేమ వివాహం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్న మాయకొండ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్‌ కుమార్తె లక్ష్మి, 'కన్నడ మాస్తిగుడి' దర్శకుడు పీ సుందర్‌ గౌడలు గురువారం నాడు చాముండి కొండపై వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సుందర్ బంధువులు పలువురు హాజరయ్యారు.

మరోపక్క, ఎమ్మెల్యే శివమూర్తి తన కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మైసూరులో వరుడి బంధువులు బసచేసిన హోటల్ వద్దకు వచ్చి అక్కడున్న వారందరినీ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన వధూవరులు, సీక్రెట్ గా బెంగళూరుకు పారిపోయారు. ఆపై వీరిద్దరూ కలసి ఓ సెల్ఫీ వీడియో తీసుకుని, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లక్ష్మి మాట్లాడుతూ, సుందర్ అంటే తనకు ఇష్టమని, కోరి అతన్ని పెళ్లి చేసుకున్నానని, ఎవరికీ ఇబ్బందులు కలిగించవద్దని వేడుకుంది. కాగా, గత ఆరు నెలలుగా వీరిద్దరి మధ్యా ప్రేమాయణం సాగినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Karnataka
Marriage
Mla Daughter
Movie Director
Love

More Telugu News