పార్టీ ముఖ్య నేతలను తన ఇంటికి పిలిపించుకున్న చంద్రబాబు!
- మరికాసేపట్లో మంత్రులతో భేటీ
- ఇప్పటికే చేరుకున్న యనమల, కాలువ శ్రీనివాసులు
- ఎన్డీయేలో కొనసాగాలా? వద్దా?
- చర్చించనున్న టీడీపీ నేతలు
ఇప్పటికే మంత్రులు యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు తదితరులు ఉండవల్లి చేరుకున్నారు. కేంద్ర మంత్రుల రాజీనామా, ప్రధాని ఫోన్ అనంతర పరిణామాలను విశ్లేషించనున్న టీడీపీ నేతలు, ఎన్డీయేలో కొనసాగాలా? వద్దా? అనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కుటుంబరావు తదితర నేతలు కూడా హాజరు కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.