India: టీమిండియా విజయ లక్ష్యం 140 పరుగులు

భార‌త్, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య కొలంబోలో జరుగుతోన్న టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లో తమిమ్ ఇక్బల్ 15, సౌమ్య సర్కార్ 14, లిటోన్ దాస్ 34, రహీమ్ 18, మహ్మదుల్లా 1, షబ్బీర్ రెహ్మాన్ 30, మెహిదీ మాసన్ 3, టాస్కిన్ అహ్మద్ 8, రుబెల్ హాసన్ 0, ముస్తాఫిజర్ రహ్మాన్ 1 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జయ్‌దేవ్ మూడు వికెట్లు తీయగా, విజయ్ శంకర్ 2, శార్దూల్ ఠాకూర్, ఛాహెల్ తలో వికెట్ తీశారు.    
India
Sri Lanka
Bangladesh

More Telugu News