Virat Kohli: పురుషులు, మహిళలు సమానం కాదు: మహిళా దినోత్సవం సందర్భంగా కోహ్లీ శుభాకాంక్షలు

షార్ట్స్‌లో చూడండి
స్త్రీ, పురుషులు సమానం కాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలకు కోహ్లీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పెట్టిన వీడియోకు 'మీ జీవితంలో విలువైన మహిళలను ట్యాగ్ చేయాల'ని అభిమానులను కోరాడు. తన భార్య అనుష్క శర్మను ట్యాగ్ చేశాడు.

ఈ సందర్భంగా వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ, స్త్రీ, పురుషులు సమానం కాదన్నాడు. నిజాయతీగా చెప్పాలంటే ఒకరితో ఒకరిని పోల్చకూడదని చెప్పాడు. లైంగిక వేధింపులు, వివక్ష, సెక్సిజమ్, గృహ హింస, బెదిరింపులు.. లిస్టు చాలా పెద్దదైనా, వాటన్నింటినీ భరిస్తూ కూడా మహిళలు ఎదుగుతున్నారని హర్షం వ్యక్తం చేశాడు. సమానత్వం కంటే వాళ్లు ఎక్కువే అయినప్పటికీ, పురుషులతో మహిళలకు సమానత్వం లేదని పేర్కొన్నాడు. ఇది సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
Go Back to Shorts
Virat Kohli
Social Media
Facebook

More Telugu News