కటీఫ్.. చంద్రబాబుకు రాజీనామాలు సమర్పించిన బీజేపీ మంత్రులు!
- చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన కామినేని, మాణిక్యాలరావు
- మంత్రులుగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు
- విలువలకు కట్టుబడి పనిచేశారన్న చంద్రబాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వీరిద్దరూ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రులుగా తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరిపై చంద్రబాబు కూడా ప్రశంసలు కురిపించారు. విలువలకు కట్టుబడి పనిచేశారంటూ కితాబిచ్చారు. మరోవైపు, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే సుజనా, అశోక్ లు తమ రాజీనామాలపై ప్రకటన చేయనున్నారు.