Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉత్కంఠను రేకెత్తిస్తోన్న 'మెర్క్యురీ' టీజర్

  • కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'మెర్క్యురీ'
  • ప్రధానమైన పాత్రలో ప్రభుదేవా 
  • ఏప్రిల్ 13న వివిధ భాషల్లో విడుదల
ఆ మధ్య ముంబై వెళ్లిన ప్రభుదేవా .. దర్శకుడిగా కొన్ని హిట్ చిత్రాలు చేశాడు. ఆ తరువాత మళ్లీ చెన్నైకి చేరుకొని నటన పట్ల .. నిర్మాణం పట్ల దృష్టి పెట్టాడు. అలా 'అభినేత్రి' వంటి హారర్ థ్రిల్లర్ చేసిన ఆయన, తాజాగా 'మెర్క్యురీ' సినిమా చేశాడు. గతంలో 'పిజ్జా' సినిమాను రూపొందించిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఊరికి దూరంగా విసిరివేయబడినట్టుగా ఒక ఇల్లు కనిపిస్తోంది. చిమ్మ చీకట్లో కొంతమంది కుర్రాళ్లు భయంతో దాక్కుంటున్నారు. ఒళ్లంతా రక్తంతో తడిసిన ప్రభుదేవా .. వాళ్లని వెతుక్కుంటూ వస్తున్నాడు. తమ శ్వాస శబ్దం కూడా బయటికి రాకూడదన్నట్టుగా వాళ్లంతా ఊపిరి బిగబడుతుండటం ఈ టీజర్లో కనిపిస్తోంది. ఫొటోగ్రఫీ .. రీ రికార్డింగ్ ఈ సినిమాకి ప్రాణం పోశాయనే విషయాన్ని ఈ టీజర్ చూసి చెప్పొచ్చు. ఏప్రిల్ 13వ తేదీన ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. 

prabhudeva

More Telugu News