సూర్యుని సమీపంలోకి మీ పేరును పంపించుకునే అవకాశం... నాసా ఆఫర్

  • ఏప్రిల్ 27 వరకు పేర్లను తెలియజేయవచ్చు
  • ఇలా వచ్చిన పేర్లన్నింటికీ ఓ మైక్రోచిప్ లో చోటు
  • దాన్ని నాసా సోలార్ ప్రోబ్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉంచి ప్రయోగం
వినడానికే నమ్మశక్యం కాకుండా ఉంది కదా...? అయినా ఇది నిజమే. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ మేరకు ఆఫర్ ఇచ్చింది. సూర్యుని వాతావరణంలో మీ పేరు ప్రయాణించాలని కోరుకునే వారు తమ పేర్లను తెలియజేయాలని సూచించింది. ఏప్రిల్ 27 వరకు ఈ అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో నాసా వెబ్ సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు తమ పేరును తెలియజేయవచ్చు. ఇలా ఆసక్తి వ్యక్తీకరించిన వారి పేర్లన్నింటినీ ఓ మైక్రో చిప్ లో పొందుపరిచి దాన్ని ఈ వేసవిలో ప్రయోగించే రాకెట్ లో ఉంచనుంది.

నాసా సూర్యుని చుట్టూ వాతావరణంపై అధ్యయనానికి గాను పార్కర్ సోలార్ ప్రోబ్ పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. ఓ కారు పరిమాణంలో ఉండే స్పేస్ క్రాఫ్ట్ ను నేరుగా సూర్యుని వాతావరణంలోకి పంపించనుంది. సూర్యుని చుట్టూ సౌర శక్తి, వేడి ప్రసారం తదితర అంశాలపై దీని ద్వారా సమాచారం సేకరిస్తుంది. సూర్య గ్రహాన్ని అర్థం చేసుకోవడం, అక్కడే జరిగే మార్పులు, అవి సౌర వ్యవస్థకు ఎలా విస్తరించేది, భూమి, ఇతర ప్రపంచంపై దాని ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేయనున్నట్టు నాసా తెలిపింది.
Go Back to Shorts
nasa
solar probe

More Telugu News