ఇవాళ లెనిన్ విగ్రహం.. రేపు కుల తీవ్రవాది పెరియార్.. అంటూ అగ్నికి ఆజ్యం పోసిన బీజేపీ!
- రామస్వామి నాయకర్ విగ్రహాన్ని తొలగించాలంటూ రాజా ట్వీట్
- తమిళ రాజకీయాల్లో చెలరేగిన అలజడి
- రామస్వామి విగ్రహాన్ని టచ్ చేసి చూడమంటూ వార్నింగ్
రాజా వ్యాఖ్యలపై తమిళనాడులో రాజకీయ వివాదం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలను తమిళ పార్టీలు తప్పుబట్టాయి. రాజాను వెంటనే అరెస్ట్ చేయాలని... గూండా యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పెరియార్ విగ్రహాన్ని టచ్ చేస్తే... తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. అయితే, తన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగడంతో... తన ట్వీట్ ను హెచ్.రాజా తొలగించారు.