నాసా సాయంతో ఆస్కార్ కి కొత్త శోభ
- ఆస్కార్ అవార్డును టిన్ అల్లాయ్ మిశ్రమంతో తయారు చేస్తారు
- ఆవిరి రూపంలో బంగారు పూత పూస్తారు
- ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ అనే నూతన సాంకేతిక విధానం వినియోగించిన ఎప్నర్ టెక్నాలజీస్
ఆస్కార్ ట్రోఫీ రూపకల్పన కోసం తయారీదారులు టిన్ అల్లాయ్ మిశ్రమాన్ని వినియోగిస్తారు. అనంతరం దీనికి బంగారు వర్ణం పూత పూస్తారు. ఈ బంగారువర్ణాన్ని ఆవిరి రూపంలో కోటింగ్ గా వేస్తారు. ఇది కాలక్రమంలో దాని మెరుపును కోల్పోతోంది. ఇకపై అలా జరగకూడదని ఆస్కార్ అవార్డు నిర్వాహకులు కోరుకున్నారు. దీంతో నాసా సాయం తీసుకున్నారు.
గతంలో వేసే ఆవిరి కోటింగ్ స్థానంలో లేజర్ గోల్డ్ గా పిలిచే ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ ను ఈ సారి ఆస్కార్ అవార్డు ప్రతిమల రూపకల్పనలో వినియోగించారు. దీంతో ఆస్కార్ ప్రతిమ మరింత ప్రకాశవంతంగా మారడమే కాకుండా, ఆ వర్ణం ఎన్నటికీ చెరిగిపోదని ఎప్నర్ టెక్నాలజీస్ చెబుతోంది. దీనిపై ఆ కంపెనీ ప్రెసిడెంట్ డేవిడ్ ఎప్నర్ మాట్లాడుతూ, ‘మేం వేసిన గోల్డ్ కోటింగ్ ఇక ఎప్పటికీ చెరిగిపోదు. అందుకు మేం జీవితాంతం గ్యారెంటీ ఇస్తున్నాం’ అన్నారు.