'విశ్వాసం'తో రంగంలోకి దిగుతోన్న అజిత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'విశ్వాసం'తో రంగంలోకి దిగుతోన్న అజిత్

  • శివ దర్శకత్వంలో 'విశ్వాసం'
  • అజిత్ తో ఇది నాల్గొవ మూవీ 
  • రెగ్యులర్ షూటింగ్ కి సన్నాహాలు   
అందాల హీరోగా తమిళంలో అజిత్ కి పేరుంది. తెలుగులోనూ ఆయన అభిమానుల సంఖ్య భారీగానే ఉంటుంది. ఆయన తాజా చిత్రంగా 'విశ్వాసం' సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. గతంలో 'వీరమ్' .. 'వేదాళం' .. 'వివేకం' సినిమాలతో అజిత్ కి హిట్స్ ఇచ్చిన దర్శకుడు శివ .. 'విశ్వాసం' సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

 ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి షూటింగ్ మొదలుకానుంది. ఒక పాట చిత్రీకరణతో ఈ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఆ తరువాత ఏప్రిల్ రెండవ వారం నుంచి కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తరువాత షెడ్యూ ల్స్ ను చెన్నై .. ముంబైలలో ప్లాన్ చేశారు. ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్ కొట్టిన కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా కావడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి .      
ajith
shiva

More Telugu News