పోడియంలోకి టీఆర్ఎస్ కూడా... పట్టుమని నిమిషమైనా సాగని లోక్ సభ, రాజ్యసభ... వాయిదా!
- క్షణాల్లోనే వాయిదా పడ్డ లోక్ సభ, రాజ్యసభ
- పోడియంలోకి దూసుకొచ్చిన పలు పార్టీల ఎంపీలు
- రిజర్వేషన్ల పెంపును డిమాండ్ చేసిన టీఆర్ఎస్
రాజ్యసభలో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ సభ్యులు ప్రత్యేక హోదా డిమాండ్ తోను, టీఆర్ఎస్ ఎంపీలు విభజన హామీల అమలును, తెలంగాణలో రిజర్వేషన్ల కోటాను పెంచాలన్న డిమాండ్ తోనూ, తమిళనాడు ఎంపీలు కావేరీ నదీ జలాల సమస్యను లేవనెత్తుతూ పోడియంలోకి దూసుకెళ్లారు. శివసేనతో పాటు కాంగ్రెస్ సభ్యులు కూడా పోడియం వైపు వెళ్లడంతో సభ జరిగే పరిస్థితి లేదని భావించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను, చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను వాయిదా వేశారు. ఆ తరువాత ఎంపీలంతా బయటకు వచ్చి గాంధీ విగ్రహం ముందు నినాదాలు చేస్తూ నిరసనలు కొనసాగించారు.