దేశీయ ప్రయాణం 799 రూాపాయలకే.. ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్

  • దేశీయ ప్రయాణం 799 రూపాయలకే
  • ఒక వైపు ప్రయాణం ప్రారంభ టికెట్ ధర అన్నిపన్నులు కలుపుకుని 799 రూపాయలు
  • అంతర్జాతీయ ప్రయాణ ప్రారంభ ధర 999 రూపాయలు
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా బంపర్ ఆఫర్‌ ను ప్రకటించింది. దేశీయ ప్రయాణాన్ని కేవలం 799 రూపాయలకే అందించనున్నట్టు వెల్లడించింది. ఈ ఆఫర్ లో ఈ నెల 11 లోపు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, ప్రయాణం మాత్రం 3 సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది మే 28 లోపు ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది. అన్ని పన్నులు కలుపుకొని ఒకవైపు ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను 799 రూపాయలుగా నిర్ణయించినట్టు తెలిపింది.

ఈ ఆఫర్ హైదరాబాద్‌, బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్‌ కతా, గోవా, జైపూర్, పుణె, ఇంపాల్, వైజాగ్, శ్రీనగర్, రాంచి, భువనేశ్వర్, చెన్నైల మధ్య తిరిగే ఎయిర్ ఏషియా విమానాలకు వర్తించనుందని తెలిపింది. ఈ ఆఫర్ తో పాటు 999 రూపాయలకే అంతర్జాతీయ ప్రయాణ టికెట్ ను కూడా అందించనున్నట్టు తెలిపింది. వివరాలకు ఎయిర్ ఏషియా వెబ్ సైట్ చూడాలని తెలిపింది. 
Go Back to Shorts
air asia
799 tickets
999 tickets

More Telugu News