యాక్షన్ సీన్లో గాయపడిన హీరో....షూటింగ్ పూర్తిచేసి శభాష్ అనిపించుకున్న వైనం..!
- 'సుయ్ ధాగా' సినిమా షూటింగ్ సందర్భంగా గాయం
- వెంటనే వైద్యుల ప్రథమ చికిత్స..రెస్ట్ తీసుకోవాలని సూచన
- వద్దంటూ తిరిగి షూటింగ్లో పాల్గొన్న హీరో...యూనిట్ సభ్యుల ప్రశంసలు
ఈ సన్నివేశంలో భాగంగా హీరో మెట్లపై నుంచి కిందికి దొర్లుకుంటూ రావాలి. ఇలా దొర్లుకుంటూ వస్తున్నప్పుడు ఒక మెట్టును వదిలి మరో మెట్టుపై పడటంతో అతని నుదుటిపై స్వల్ప గాయమైంది. దాంతో షూటింగ్‌కు వెంటనే బ్రేక్ ఇచ్చారు. గాయానికి వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. ఒక్క రోజు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వారు సూచించారు. కానీ, రెస్ట్ గిస్ట్ అవసరం లేదని, షూటింగ్ ఆలస్యం కావొద్దని చెబుతూ ఆ యాక్షన్ సీన్‌ను పూర్తి చేసేశాడట వరుణ్. అతని ప్రొఫెనలిజానికి యూనిట్ సభ్యులు శభాష్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఈ సినిమాలో అతను మౌజీ పాత్రను పోషిస్తున్నాడు.